AP: రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపుల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు రప్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. వీటిని స్వీకరించేందుకు పవన్ కళ్యాణ్‌తో పాటు అటవీ శాఖ అధికారులు బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ కుంకీ ఏనుగులతో చిత్తూరు, మన్యం, అల్లూరి జిల్లాల్లో మదపుటేనుగుల సమస్యలు పరిష్కరించనున్నారు.