ఆరుగురు టెర్రరిస్టులు హతం: ఆర్మీ (వీడియో)

65చూసినవారు
గడిచిన 48 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులను అంతం చేసినట్లు ఆర్మీ మేజర్ జనరల్ ధనంజయ్, కశ్మీర్ IGP వీకే బిర్డీలు తాజాగా వెల్లడించారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని కేలార్, ట్రాల్ ప్రాంతాల్లో 2 ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టామని, ఈ ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన షహీద్ కుత్తే గతంలో రెండు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని అంతంచేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్