గత 48 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ఆర్మీ మేజర్ జనరల్ ధనంజయ్, కశ్మీర్ IGP వీకే బిర్డీ తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో వివరాలు వెల్లడించారు. J&Kలోని కేలార్, ట్రాల్ ప్రాంతాల్లో 2 ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టామన్నారు. మరణించిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన షహీద్ కుత్తే గతంలో రెండు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.