స్మార్ట్ కార్డ్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డుదారులకు టోల్ ఛార్జీలపై తగ్గింపు కల్పిస్తుంది. ఈ పథకం సాధారణ ప్రయాణికులకు టోల్ ఛార్జీలను తగ్గించి, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఇందులో ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి మంచి ఉపశమనం కలగనుంది. దీని ద్వారా ఈజీగా టోల్ చెల్లింపులు చేసుకోవచ్చు.