ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎదుటి వ్యక్తి కనిపించనంత తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే 470 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు బయట తిరిగేందుకు భయపడే స్థాయిలో పొగ కమ్ముకోవడం గమనార్హం. దీంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి.