శేషాచలం అడువుల్లో పోలీసులపై స్మగ్లర్లు దాడి

4చూసినవారు
శేషాచలం అడువుల్లో పోలీసులపై స్మగ్లర్లు దాడి
AP: అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో పోలీసులపై స్మగ్లర్లు, కూలీలు దాడి చేశారు. సుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. డంపింగ్ కేంద్రం నుంచి దుంగలు తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు, కూలీలు దాడికి దిగారు. గోవిందన్ అనే స్మగ్లర్ నుంచి రూ.80 లక్షల విలువైన 26 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి చెప్పారు.

సంబంధిత పోస్ట్