చాలా మంది గుండె పోటుతో విగత జీవులుగా మారిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం గుండెపోటుతో చనిపోతాయా.. అంటూ కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒక పాము అప్పటి వరకు బాగానే.. ఉండి ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ.. గిల గిల కొట్టుకొంటూ చనిపోయింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.