పర్యావరణానికి హాని చేయకుండా కరెంటును ఉత్పత్తి చేసేవిగా పేరొందిన సోలార్ ప్యానెల్స్ భవిష్యత్తులో ఇకపై కనిపించకపోవచ్చు. జపాన్‌లో ఇప్పటికే వీటి వాడకాన్ని తగ్గించేశారు. అలాగే వీటి స్థానంలో పెరోవ్‌స్కైట్ అనే కొత్త ప్యానెల్స్‌ను తీసుకొచ్చారు. తక్కువ ధరలో ఎక్కువ కరెంటు ఉత్పాదకతే లక్ష్యంగా పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్‌ను తీసుకొచ్చినట్టు పరిశోధకులు చెప్తున్నారు. అలాగే వెలుతురు పడే ఎక్కడైనా వీటిని బిగించుకోవచ్చట.