ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సినీ నటుడు సోనూసూద్ 4 అంబులెన్స్‌లు సాయం చేశారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన సోనూసూద్ సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరపున ఇచ్చిన ఆ అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించి అభినందించారు. కరోనా సమయం నుంచి తనలో ఉన్న సాయం గుణాన్ని సోనూసూద్ బయటపెట్టిన విషయం తెలిసిందే.