గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాను ప్రపంచకప్ ఊరిస్తోంది. గత నాలుగు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో, పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో భారత్ చేతిలో, న్యూజిలాండ్‌తో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఓడిపోయారు. ఆదివారం జరిగిన మహిళల అండర్-19 ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయారు.