జూన్‌ 5 నాటికి ఏపీకి నైరుతి రుతుపవనాలు

71చూసినవారు
జూన్‌ 5 నాటికి ఏపీకి నైరుతి రుతుపవనాలు
అండమాన్ నికోబర్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెల మొదటి వారం నాటికి ఇవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని, జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి ప్రవేశించి, జూన్ 10 నాటికి రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల వరకు విస్తరించాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్