మరో పది రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్‌లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా రుతుపవనాలు కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.