రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని.. పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధికశాతం రీసైక్లింగ్ అవుతున్న నేపథ్యంలో వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కారు ఆలోచన అని అధికారులు చెబుతున్నారు.