10 నుంచి బోదకాలుపై ప్రత్యేక క్యాంపెయిన్

53చూసినవారు
10 నుంచి బోదకాలుపై ప్రత్యేక క్యాంపెయిన్
ఈ నెల 10 నుంచి బోదకాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వచ్చి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందిస్తారని కేంద్రం తెలిపింది. కాగా, క్యూలెక్స్ దోమలు కుట్టడం ద్వారా బోదకాలు వ్యాపిస్తుంది. కాళ్లతో పాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.

సంబంధిత పోస్ట్