AP: ఉభయ గోదావరి జిల్లాల నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలనుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేలా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇదిలా ఉంటే తాజాగా రైల్వేశాఖ కూడా కాకినాడ నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడంపై గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..