పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అటువంటి నేరాలకు భారీ జరిమానా విధించే నిబంధనలతో కూడిన బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.