AP: రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 71,340 మందికి కూటమి ప్రభుత్వం గురువారం నుంచి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయనుంది. కుటుంబంలో పింఛను అందే భర్త చనిపోతే, ఆయన మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే భార్యకు కొత్తగా పింఛను మంజూరు చేస్తోంది. 2023 డిసెంబరు నుంచి ఈ కేటగిరీ కింద అర్హులను గుర్తించిన సర్కారు వారికి సచివాలయ సిబ్బందితో పింఛను అందించనుంది. నెలకు రూ.4 వేల చొప్పున పింఛను అందించనుంది.