ఆత్మకూరుకు చేరుకున్న ఐదుగురు మంత్రులు, ఎంపీ, కలెక్టర్, పలు శాఖల చైర్మన్లు. ఆత్మకూరులో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రుల బంధం ఆదివారం చేరుకుంది. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సమక్షంలో స్పెషల్ బలగాలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.