అనంతసాగరం: విశ్వానికి వెలుగులు నిచ్చే సూర్య భగవానుని జయంతి రథసప్తమి సందర్భంగా మంగళవారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిస్కెట్లు ఉపయోగించి సూర్యుని రథం తయారు చేసి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన రథం ఆకట్టుకుంటుంది. వారిని హెచ్ఎం సురేశ్ , ఉపాధ్యాయులు అభినందించారు.