అనంతసాగరంలో ఏపీయూఎస్ వారు ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో చేజర్ల మండల లుంబిని స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 8 మండలాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు టాలెంట్ టెస్టులో పాల్గొనగా, లుంబిని విద్యార్థులు 1,7,9 స్థానాలను కైవసం చేసుకున్నారు. 1 వ స్థానంలో కె. హిమవర్ణ , 7వ స్థానం లో వి. సాయి వెంకట చరణ్, 9 వ స్థానం లో యు. అనూష లు నిలిచారు. ఈ క్రమంలో వారిని ఉపాధ్యాయులు అభినందించారు.