నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎస్సై సూర్య ప్రకాష్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా మండల ప్రజలకు సూచనలు చేశారు. శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ పండుగకు ఊర్లకు వెళ్లేవారు నగదు, బంగారు ఆభరణాలను ఇళ్లలో పెట్టుకోకూడదని బ్యాంకులో పెట్టుకుని వెళ్లాలని సూచించారు. అలాగే ఇంటిని గమనిస్తూ ఉండమని చుట్టుపక్కల వారికి చెప్పాలన్నారు. కోడి పందాలు, పేకాటలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.