సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మకూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమణయ్య, ఎంపీడీవో శేషగిరి రావుతో ఆదివారం సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో జులై ఒకటవ తేదీన సోమవారం జరగబోయే పింఛన్ పంపిణీ కార్యక్రమం పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ పింఛన్ పంపిణీ చేయాలన్నారు.