జగన్ దుష్ట చతుష్టయంలో ఒకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వచ్చి, కూటమి ప్రభుత్వం గురించి చెడ్డగా చెప్పాలని ఒక్కొక్కరి చేతిలో డబ్బుతో కూడిన ఒక్కొక్క కవర్ పెట్టాడు. జగన్ దుష్ట చతుష్టయమే తిరుమల పవిత్రతను మంటగలిపి, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఒకవైపు ప్రాణాలు, అవయవాలు కోల్పోయి ప్రజలు ఆర్తనాధాలు పెడుతుంటే శవాలపై రాజకీయం చేస్తున్నారని మండపడ్డారు.