
రాష్ట్రంలో 4.28 లక్షల ఉద్యోగాలు?
AP: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 45% రాయితీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 34 ప్రాజెక్టులకు రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే ఈ ప్రాజెక్టుల ద్వారా 4,28,705 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.