ఆత్మకూరు: లూయిస్ బ్రెయిలీకి నివాళులు

58చూసినవారు
ఆత్మకూరు: లూయిస్ బ్రెయిలీకి నివాళులు
అంధులకు చుక్కల లిపి కనుగొన్న లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా శనివారం అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు హరిణి, లక్ష్మి ప్రణతి బ్రెయిలీ లిపిని చార్ట్ పై ప్రదర్శించారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి లూయిస్ బ్రెయిలీ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్