నెల్లూరు జిల్లా చేజర్లలో గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు. చేజర్ల బస్టాండ్ లో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియలేదు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చేజర్ల పోలీసులు తెలిపారు.