సంగం: ఈదురు గాలుల వల్ల జాతీయ రహదారిపై పడ్డ తాడిచెట్టు

80చూసినవారు
సంగం: ఈదురు గాలుల వల్ల జాతీయ రహదారిపై పడ్డ తాడిచెట్టు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వీచిన ఈదురుగాలులు పలు ప్రమాదాలనే సృష్టించాయి. కొన్ని గ్రామాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గాలి తీవ్రత తట్టుకోలేక వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక రైతుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా మారింది. ఇదే క్రమంలో సంగం సమీపంలో జాతీయ రహదారిపై ఓ తాడిచెట్టు పడిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ చెట్టు తొలగించడానికి పోలీసులు, స్థానికులు ఎంతో శ్రమించారు.

సంబంధిత పోస్ట్