దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొంటారు. 20వ తేదీ చేజర్ల మండలం మాముడూరు, 21వ తేదీ సంఘం మండల, 22న ఏఎస్పేట మండలం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24 న అనంతసాగరం, 25న మర్రిపాడు, 26న ఆత్మకూరు లో పర్యటిస్తారని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.