వేసవి సెలవులలోనూ ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ పై వివిధ కోర్సులను అందుబాటులో ఉంచింది. చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు చల్లా చంద్రశేఖర్ రెడ్డి సెలవులలో 50 కోర్సులు పూర్తిచేసి, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందారు. వీరిని పలువురు ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50కోర్సులు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు.