యువత చేతుల్లో దేశ భవిష్యత్తు: ఎమ్మెల్యే

51చూసినవారు
యువత చేతుల్లో దేశ భవిష్యత్తు: ఎమ్మెల్యే
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గూడూరు ఏఏఆర్ ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించారు. యువత బాగా చదివి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. తనను గెలిపించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ రమణకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్