నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం లోని చేవూరులో గల రామదూత ఆశ్రమం ఆక్రమణలో ఉన్న చెరువు, అటవీ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీన పరుచుకోవాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆ భూములను స్వాధీనం పరుచుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు కాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు స్వాధీనం చేసుకోవాలన్నారు.