కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆహార కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇస్తున్న అన్నంపై కక్కుర్తి పడకండి అంటూ అధికారులను హెచ్చరించారు. ఇతర శాఖలలో జరుగుతున్న అవినీతి వేరు అని, పేద పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే మెనూ సరిగా పెట్టాలని కోరారు.