వలేటివారిపాలెం మండలంలోని చుండి ఆదర్శ పాఠశాలకు చెందిన వసతి గృహంలో చేరుటకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి వసతి గృహం అందుబాటులోకి వస్తుందన్నారు. 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న 50 మంది బాలికలకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు.