భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడవసారి ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు కావలి పట్టణంలో విజయోత్సవ సంబరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు బిజెపి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.