కావలికి చెందిన తొట్టెంపూడి కావ్య బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శనివారం డాక్టరేట్ అందుకున్నారు. ఆమె జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో డాక్టరేట్ పట్టా పొందారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి ఆమె ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. వి. సురేఖ, విద్యార్థులు పాల్గొన్నారు.