కావలి పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్ లో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన బాలుడు పోనమల్లి చక్రధర్ (11) కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.