కావలి నియోజకవర్గం, బోగోలు మండలం అల్లెమడుగు పంచాయతీ కడనూతల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. వైసీపీ, టిడిపి మద్దదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో టిడిపి నేత సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఆతనిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంగళవారం అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్లి సురేంద్రను పరామర్శించారు. అలాగే సురేంద్రకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం నెల్లూరు తరలించారు.