దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

57చూసినవారు
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ జువ్విగుంటపాలెంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు పశుగ్రాసం వాములు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ఉదయం జువ్విగుంటపాలెం వెళ్లి బాధితులు నారి సుందరరావు, నారి రమేష్, నారి కోటేశ్వరరావు లను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్