అల్లూరు బస్టాండ్ సెంటర్లో విద్యార్థులు ర్యాలీ కార్యక్రమం

62చూసినవారు
అల్లూరు బస్టాండ్ సెంటర్లో విద్యార్థులు ర్యాలీ కార్యక్రమం
అల్లూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలు బడికి పెద్దలు పనికి అనే నినాదాలు చేశారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్