అల్లూరు మండలంలోని పురిని కొత్తపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పిల్లలు బడికి పెద్దలు పనికి అంటూ ర్యాలీ చేశారు. చదువుకుంటే గొప్ప భవిష్యత్తు ఉంటుందని పాఠశాల హెడ్మాస్టర్ పర్వీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురవయ్య తదితరులు పాల్గొన్నారు.