అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై మబ్బులన్నీ నల్లగా మారిపోయాయి. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షం కురిసింది. మండలంలోని నార్త్ మోపూరు, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ, పురిని, ఇందుపూరు, మందిరం, తుఫాన్ నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.