నేడు హంస వాహనంపై శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం

50చూసినవారు
నేడు హంస వాహనంపై శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం
విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శనివారం రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్