జులై ఒకటవ తేదీన విడవలూరు మండలంలో పింఛను పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో మొత్తం 4. 98 కోట్లు నగదును ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఒకటవ తేదీన ఉదయం 6 గంటల నుండి సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.