కొడవలూరు మండలం చంద్రశేఖరపురం లోని ఏకలవ్య పాఠశాలలో గురుకుల వసతి గృహంలో 25 మంది విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం, తాగునీరు వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ వార్డెన్ పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి హుటాహుటిన వైద్య సేవలను అందజేస్తున్నారు.