దోమల నివారణకు చర్యలు చేపట్టిన వైద్య సిబ్బంది

67చూసినవారు
దోమల నివారణకు చర్యలు చేపట్టిన వైద్య సిబ్బంది
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో దోమల నియంత్రణకు వైద్య అధికారులు చర్యలు చేపట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారి మనోజ్ కుమార్ పెద్దూరులోని నీటి కొలనులో దోమల లార్వాను నాశనం చేసే గంబూషియా చేపలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్