రేపు బుచ్చిరెడ్డిపాలెంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

78చూసినవారు
రేపు బుచ్చిరెడ్డిపాలెంలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సోమవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఖాజా నగర్ లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు, అనంతరం దామరమడుగులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.