షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరీలు దగ్ధమైన ఘటన విడవలూరు మండలంలోని అన్నా రెడ్డిపాలెం గిరిజన కాలనీలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్టీ కాలనీకి చెందిన ఆడిపూడి శైలజ పూరింట్లో ఉన్న విద్యుత్తు మీటర్ వద్ద మంటలు చెలరేగడంతో మంటలు వచ్చాయి అనంతరం ఆమె తండ్రి గడ్డం బ్రహ్మయ్య ఇల్లు కూడా సమీపంలో ఉండటంతో గాలులకు రెండు పూరిల్లు పూర్తిస్థాయిలో తగలబడ్డాయి.