నగర పంచాయతీలోని 10వ వార్డు హరివిల్లు నందు నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైస్ చైర్మన్ లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రిన్, కౌన్సిలర్లు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు.