ఆరోగ్యవంతమైన సమాజం, దుష్ప్రభావాలు లేని వైద్యం హోమియోపతి లక్ష్యమని ప్రభుత్వ హోమియో వైద్యురాలు జి. జ్ఞాన ప్రసూన అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని శాఖా గ్రంధాలయంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా అదుపు ఉంటుందన్నారు. పిల్లలకు పెద్దలకు హోమియో మందులు అందజేశారు.