రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా మునీర్

85చూసినవారు
రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా మునీర్
నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా షేక్ మునీర్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గత 17 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ ఏడాది రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you